పెట్రోల్ బంకుల  వద్ద వాహనదారుల క్యూ.. ఉమ్మడి మహబూబ్‌‌‌‌‌‌‌‌నగర్, నల్గొండ జిల్లాల్లో పరిస్థితి

పెట్రోల్ బంకుల  వద్ద వాహనదారుల క్యూ.. ఉమ్మడి మహబూబ్‌‌‌‌‌‌‌‌నగర్, నల్గొండ జిల్లాల్లో పరిస్థితి

ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా మధ్య యుద్ధ వాతావరణం కారణంగా ఇంధన కొరత ఏర్పడుతుందనే వదంతులు సోషల్ మీడియాలో రావడంతో ఉమ్మడి మహబూబ్‌‌‌‌‌‌‌‌నగర్, నల్గొండ జిల్లాల్లో పెట్రోల్ బంకులు వాహనదారులతో కిటకిటలాడాయి. బుధవారం ఉదయం నుంచే పెట్రోల్, డీజిల్ కోసం వాహనదారులు బారులు తీరడంతో అనేక బంకుల్లో నిల్వలు ముగిసి ‘నో స్టాక్’ బోర్డులు వెలిశాయి. వాహనదారులు తమ వాహనాల ట్యాంకులను ఫుల్ చేయించుకోవడంతో పాటు బాటిళ్లు, క్యాన్లు డీజిల్‌‌‌‌‌‌‌‌ను నింపుకుంటూ కనిపించారు. మరోవైపు సీఎన్‌‌‌‌‌‌‌‌జీ గ్యాస్ దొరకక ఆటో డ్రైవర్లు, కమర్షియల్ సిలిండర్ల కొరతతో హోటల్ యజమానులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. 
-